Homeహైదరాబాద్latest Newsవీళ్లకి హిట్ పడాల్సిందే.. లేదంటే కష్టమే..!!

వీళ్లకి హిట్ పడాల్సిందే.. లేదంటే కష్టమే..!!

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు. ఏడాదికి ఓకే సినిమా తీస్తూ స్టార్ హీరోలు జనాలని అలరిస్తున్నారు. ఇటీవలే కొందరు హీరోలు వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్నారు. ఒక్కపుడు వరుస హిట్లు ఇచ్చిన ఆ హీరోలు ఇప్పుడు మాత్రం ఒక్క హిట్టు కోసం కష్టపడుతున్నారు. వారే మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, సూర్య, నితిన్.. ఈ హీరోలు ప్రస్తుతం తమ కొత్త సినిమాలతో రిలీజ్ కి రెడీగా ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి : మెగాస్టార్ చిరంజీవి ఒక్కపుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒక చేతితో ఏలిన హీరో.. ఇప్పుడు మాత్రం ఒక హిట్ సినిమా కోసం ఎదురుచూస్తునాడు. ”ఆచార్య”, ”భోలా శంకర్” వంటి సినిమాలతో డిజాస్టర్స్ అందుకున్న చిరు ఇప్పుడు ”విశ్వంభర” సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాలి అని చిరు ప్లాన్ చేస్తున్నాడు.

రవితేజ : మాస్ రాజా రవితేజ (Ravi Teja) సినిమాలు అంటే గ్యారంటీగా హిట్ అవుతాయి అనే టాక్ ఉండేది. ఒకప్పుడు సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్లు అనే పేరు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి లేదు. రవితేజ ప్రస్తుతం ఒక హిట్ కోసం సతమతం అవుతున్నాడు. రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇటీవలే చేసిన అని సినిమాలు ప్లాప్ గా నిలిచాయి. ఈ క్రమంలో త్వరలో రాబోయే ”మాస్ జతార” సినిమాపైనే అసలు పెట్టుకున్నాడు. ఈ సినిమా కూడా ప్లాప్ అయితే రవితేజ సినీ కెరీర్ కష్టాలో పడినట్లే అని చెప్పాలి. ఇప్పటికే రవితేజా సినీ మార్కెట్ దారుణంగా పడిపోయింది.

నితిన్ : ”భీష్మ” సినిమా తర్వాత నితిన్ వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. నితిన్ చివరి సినిమా ”రాబిన్‌హుడ్” డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ”తమ్ముడు” సినిమాపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా జూలై 4న థియేటర్లలో విడుదల కానుంది. మరి సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

సూర్య : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్నాడు. ఇటీవలే పాన్ ఇండియా సినిమా అని ”కంగువ” అనే సినిమా చేసాడు. తీరా ఆ సినిమా విడుదలైక భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ”కంగువ” సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నా సూర్య అది ప్లాప్ కావడంతో డీలా పడిపోయాడు. ఈ నేపథ్యంలో సూర్య ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య ”రెట్రో” అనే సినిమాలో నటించాడు.ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. మరి సూర్య ఈ సినిమాతో హిట్ టాక్ లోకి రావాలని చూస్తున్నాడు.

Recent

- Advertisment -spot_img