Homeజిల్లా వార్తలుడబ్బులు కట్టలేదని వేసిన కుట్లు విప్పేశారు..

డబ్బులు కట్టలేదని వేసిన కుట్లు విప్పేశారు..

ఇదే నిజం కామారెడ్డి: గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో రోగులపై ఆస్పత్రి సిబ్బంది దాడి చేసిన ఘటన కామారెడ్డి పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిన యువకుడు శ్రీనుకు రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం పట్టణంలోని అపెక్స్ ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్ ఫీజు 300 రూపాయలు చెల్లించి చూపించుకున్నాడు. ప్రమాదంలో తగిన గాయాలకు ఆస్పత్రి సిబ్బంది కుట్లు వేశారు. అయితే రోగి వద్ద నగదు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు తీసుకోమని చెప్పడంతో ఆస్పత్రి సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. తమ వద్ద నగదు లేదని క్రెడిట్ కార్డుతో డబ్బులు తీసుకోవాలని కోరారు. దీంతో ఆగ్రహించిన ఆస్పత్రి సిబ్బంది రోగితో పాటు తోటి స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి రోగికి వేసిన కుట్లు విప్పేసి పంపించారు. కాగా రోగి సిబ్బంది పై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.

Recent

- Advertisment -spot_img