Homeహైదరాబాద్latest Newsవాళ్లు సర్వ నాశనం అవ్వాలి..! అది చూసి నేను చనిపోవాలి…అంటూ చలాకీ చంటి సంచలన వ్యాఖ్యలు

వాళ్లు సర్వ నాశనం అవ్వాలి..! అది చూసి నేను చనిపోవాలి…అంటూ చలాకీ చంటి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించిన చంటి జబర్దస్త్ తో చలాకీ చంటిగా మారి మంచి పేరు తెచ్చుకున్నారు. జబర్దస్త్‌లో కనిపించిన తర్వాత, అతను చాలా టీవీ షోలు మరియు సినిమాలలో కూడా బిజీ అయ్యాడు. అయితే గత కొన్నాళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంటి ప్రస్తుతం కోలుకుంటున్నారు. నాలుగేళ్ల తర్వాత చంటి ఓ ఇంటర్వ్యూలో చంటి సంచలన విషయాల చెప్పారు. చంటికి కోపం, ఇగో ఎక్కువని గతంలో చాలా కథనాలు వచ్చాయి. వాటిపై చంటి కూడా స్పందించారు. చంటి మాట్లాడుతూ.. షూటింగ్ కి వస్తే కొన్ని అడుగుతానని కొంతమంది నన్ను నెగిటివ్ గా ప్రచారం చేసి, నాకు సంబంధం లేని విషయాల్లో నన్ను ఇరికించి, నాకు రావాల్సిన మంచిని ఆపేసి, నాకు రావాల్సిన ఛాన్సులు రాకుండా చేసారు అని తెలిపారు. అలా చేసిన వాళ్ళు సర్వ నాశనం అయిపోతారు. నేను బతికుండగానే వాళ్ళు నాశనం నేను అవ్వాలి. అది చూసే నేను చచ్చిపోవాలి. వాళ్ళు ఆలా సర్వ నాశనం అయిపోవాలని రోజు దేవుడిని కూడా కోరుకుంటున్నాను అని చంటి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Recent

- Advertisment -spot_img