తెలంగాణ ప్రభుత్వ పరీక్షా పత్రాల్లో కులం గురించి ఒక ప్రశ్న వచ్చింది. భారతదేశంలో సంస్కృతీకరణపై కింది ప్రకటనలలో ఏవి సరైనవి ? అంటూ ఒక ప్రశ్న రాగ.. దీనిపై తక్కువ కులం, ఎక్కువ కులం అన్న పదాలు ప్రభుత్వ పరీక్షా పత్రాల్లోనే ఉంటే ఇంక సామాజిక న్యాయం ఎట్ల వస్తది రేవంత్ రెడ్డి గారూ? మీ సమీకృత విద్యా విధానం చిలుక పలుకులు కేవలం వట్టి మాటలే, నీటి మూటలే అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ట్విట్ చేసారు. తాజాగా ఈ విషయంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ రకమైన కులతత్వ ఎజెండాను నిర్వహించడం మరియు ప్రోత్సహించడం చాలా సిగ్గుచేటు మరియు అసహ్యకరమైనది అని అన్నారు. మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేసారు.