Homeహైదరాబాద్latest NewsGoogle Maps​ నమ్మి వెళ్లి ఎడారిలో ఇరుక్కున్నరు

Google Maps​ నమ్మి వెళ్లి ఎడారిలో ఇరుక్కున్నరు

– ఇసుక రోడ్​లో కూరుకుపోయిన కార్లు
– అమెరికాలోని లాస్​ వేగాస్​లో ఘటన

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: గూగుల్ మ్యాప్​ను నమ్ముకుని వెళ్లిన కొందరు వ్యక్తుల వాహనాలు ఎడారిలో ఇరుక్కుపోయారు. ఈ ఘటన అమెరికాలోని లాస్​ వేగాస్​లో జరిగింది. ఇటీవల లాస్‌ వేగాస్‌ నుంచి కొందరు వ్యక్తులు లాస్‌ ఏంజెల్స్‌కు బయల్దేరారు. ప్రయాణం మొదలుపెట్టగానే గూగుల్‌ నావిగేషన్‌ను వ్యవస్థ వారికి ఓ షార్ట్‌కట్‌ను ఆఫర్‌ చేసింది. ఈ మార్గంలో వెళితే 50 నిమిషాల ప్రయాణం కలిసొస్తుందని పేర్కొంది. పైగా ఇది సురక్షితమైన మార్గమని చెప్పింది. దీంతో షెల్బీ బృందం ఆ మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకొంది. ఆ మ్యాప్‌ చూపిన మార్గంలో ప్రయాణించగా.. చివరికి చిక్కటి నెవాడా ఎడారిలోకి వారిని తీసుకెళ్లి వదిలింది. వీరి వాహనాలు ఓ ఇసుక రోడ్డులో కూరుకుపోయాయి. వాస్తవానికి వీరు ఓ బురద మార్గంలో నుంచి పర్వతంపైకి వెళుతుండగా ఓ ట్రక్కు డ్రైవర్‌ ఎదురై.. అటువైపు రోడ్డు లేదని చెప్పాడు. కానీ, గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకోవడంతో వీరు ముందుకెళ్లి ఇసుక దారిలో ఇరుక్కుపోయారు. దీంతో ఆందోళన చెంది కాలిఫోర్నియా హైవే పెట్రోల్‌కు ఫోన్‌ చేశారు. కానీ, సాయం అందలేదు. చివరికి ఒక టోయింగ్‌ ట్రక్కుకు కాల్‌ చేశారు. అది వీరున్న ప్రాంతానికి వచ్చి వాహనాలను బయటకు లాగి తీసుకెళ్లింది. ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు గూగుల్‌ వెల్లడించిందని న్యూయార్క్‌ పోస్టు కథనంలో పేర్కొంది. ఇటీవల భారత్‌లో కేరళలో గత నెలలో కొందరు డాక్టర్లు గూగుల్‌ మ్యాపులను అనుసరించి డ్రైవింగ్‌ చేయడంతో కారు నదిలో మునిగి పోయింది. దీంతో ఇద్దరు యువ డాక్టర్లు మృతి చెందారు. వీరు మ్యాప్‌లను అనుసరించి నీరు నిలిచి ఉన్న ప్రాంతాన్ని రోడ్డుగా భ్రమించి.. కారును నేరుగా పెరియార్‌ నదిలోకి తీసుకెళ్లారు. స్థానికులు స్పందించి ముగ్గురిని రక్షించారు.

Recent

- Advertisment -spot_img