Homeజిల్లా వార్తలుపోలీస్ ఇంటికి కన్నం వేసినా దొంగలు

పోలీస్ ఇంటికి కన్నం వేసినా దొంగలు

ఇదే నిజం జుక్కల్ : డిసెంబర్ 8న కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండల పరిధిలోని లాడేగావ్ గ్రామంలో నివాసముంటున్న ఓ రిటైర్డ్ ఎస్సై ఇంట్లో దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే జుక్కల్ నియోజకవర్గంలోని తుకారం అనే పోలీసు అధికారి మద్నూర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా, నిజామాబాద్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందారు. ప్రస్తుతం తన సొంత గ్రామమైన లాడేగాంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. గత సోమవారం శుభకార్యాలను పాల్గొనే నిమిత్తం బంధువుల ఊరికి తన ఇంటికి తాళం వేసి వెళ్లగా దొంగలు రాత్రిపూట పైకప్పు నుండి కిందికి దిగి బీరువా పగలగొట్టి వస్తువులను చిందర వందర చేసి నానా హంగామా సృష్టించారు. అయితే సదరు పదవి విరమణ పొందిన ఎస్సై ఇంట్లో దొంగలకు కేవలం దేవుని హుండీలో ఉంచినటువంటి దాదాపు 3000 రూపాయల వరకు మాత్రమే పొయాయని ఇట్టి సంఘటనపై మాజీ ఎస్సై తుకారాం స్థానిక జుక్కల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశామని తెలిపారు. కాగా ఆదివారం నాడు మధ్యాహ్నం పోలీసులు పంచనామా నిర్వహించారు. ఈ గ్రామంలో చాలా దొంగతనాలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.hh ఇదేనిజం పోలీస్ ఇంటికి కన్నం వేసినా దొంగలు

Recent

- Advertisment -spot_img