ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో మారాజు రమేష్ తండ్రి రాజలింగు నిన్న 1-11-2024 రోజున దీపావళి నోముల కొరకు వెలగటూర్ మండలం వెంకటాపూర్ గ్రామం అత్తవారింటికి వెళ్ళినారు.. ఎవరూ లేని సమయంలో దొంగలు పడ్డారు. ఈ రోజు 9:30 సమయంలో చుట్టుపక్కల వారు చూసి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వారు ఇంటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో.. పోలీసులు వెళ్లి చూడగా 2 ఉంగరాలు (ఒక తులం), కమ్మలు (అర తులం), 28 తులాల వెండి, మూడు జతల పట్ట గొలుసులు పోయాయని బాధితులు తెలిపినారు.