Homeజిల్లా వార్తలువరుసగా మూడవ సారి వరల్డ్ ఛాంపియన్షిప్ లో పతకం

వరుసగా మూడవ సారి వరల్డ్ ఛాంపియన్షిప్ లో పతకం

ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లంకు చెందిన ప్రతిభ 23 నుండి 28 వ అక్టోబర్,2024 అర్మేనియా లో జరిగిన 6వ అంతర్జాతీయ చెస్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో ప్రతిభ తక్కడపల్లి కాంస్య పతకం కైవసం చేసుకుంది.కాగా ఈసారి జరిగిన ఛాంపియన్షిప్ లో ప్రతిభ ఆడే వెయిట్ కేటగిరి తొలగించడం వల్ల తనకన్నా ఏడు కిలోలు అధిక బరువు కేటగిరి ప్రత్యర్థులతో తలపడినందుకు వివిధ దేశాల క్రీడాకారులు ప్రతిభను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఈ ఛాంపియన్ షిప్ కి పూర్తిగా స్పాన్సర్షిప్ అందించిన పోచారం సోని రెడ్డి మరియు భాస్కర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.వరుసగా వెళ్ళిన ప్రతి ఛాంపియన్షిప్ నుంచి పతకం కొల్లగొడుగు తున్నందుకు తల్లిదండ్రులు మరియు నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img