Homeఫ్లాష్ ఫ్లాష్Thirupathi:తిరుమ‌ల‌లో మ‌ళ్లీ క‌నిపించిన చిరుత‌

Thirupathi:తిరుమ‌ల‌లో మ‌ళ్లీ క‌నిపించిన చిరుత‌

Thirupathi:తిరుమలలో మ‌ళ్లీ చిరుత క‌నిపించి క‌ల‌క‌లం సృష్టించింది. దీంతో భక్తులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఘాట్ రోడ్డులోని 56 వ మలుపు వద్ద బుధ‌వారం సాయంత్రం చిరుత కనిపించింది. అప్రమత్తమైన అటవీ అధికారులు వాహనదారులను గుంపులుగా పంపిస్తున్నారు. చిరుతను దారి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ మ‌ధ్య‌నే అలిపిరి నడక దాడిలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. కర్నూలు జిల్లా ఆదోనీకి చెందిన నాలుగేళ్ల కౌశిక్ ను చిరుత నోట కరిచి తీసుకెళ్లింది. పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద బాలుడిని విడిచిపెట్టింది. ఈ ఘటనలో బాలుడి చెవి వెనుక, తలపై గాయాలయ్యాయి. ఈ ఘటన మరవకముందే మ‌ళ్లీ తిరుమ‌ల దారిలో చిరుత క‌నిపించ‌డంతో అంద‌రిలో భ‌యం నెల‌కొంది….

Recent

- Advertisment -spot_img