గుజరాత్‌లో కిలో నెయ్యి రూ.2 లక్షలు పలుకుతోంది. గుజరాత్‌లోని గోండాల్‌లో రమేష్‌భాయ్ రూపరేలియా అనే రైతు గోశాలను నడుపుతున్నాడు. అతను స్వచ్ఛమైన ఆవుపాలతో నెయ్యిని తయారు చేసి దానినుండి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తుంటాడు. ఈ నెయ్యిలో విశేషం ఏంటంటే.. ఇందులో కుంకుమపువ్వు, పసుపు, పిప్పళ్లు, గులాబీ రేకులు, మందారాలు ఇలా రకరకాల మూలికలు కలుపుతారు. ఈ నెయ్యిని కాస్త ఒంటికి రాసుకుంటే తలనొప్పి, చర్మవ్యాధులు తగ్గుతాయట.