రుహానీ శర్మ.. సుశాంత్ హీరోగా వచ్చిన చిలసౌ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలలోకి అడుగుపెట్టిన ఈ హిమాచల్ సుందరి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.రుహానీ శర్మ తెలుగులో మొదటి సినిమాతోనే మంచి పేరును దక్కించుకుంది.ఆ తర్వాత హిట ,నూటొక్క జిల్లాల అందగాడు, హర్, డర్టీ హరి వంటి చిత్రాలతో పాటు సైంథవ్,ఆపరేషన్ వాలంటైన్ చిత్రాలలోను నటించింది.అయితే ఇదిలా ఉంటే రుహానీ శర్మ తాజాగా తమిళ టాప్ దర్శకుల్లో ఒకరైన వెట్రిమారన్ నిర్మాణంలో నటించే అవకాశం దక్కింది. ఆయన దర్శకత్వంలో నటించాలని చాలా మంది హీరోయిన్స్ కూడా కోరుకుంటారు.ఆయన బ్యానర్ లో సినిమాను చేసే అవకాశం రావడం అనేది రుహానీ శర్మకి కచ్చితంగా పెద్ద జాక్ పాట్. తెలుగు ఇంకా తమిళంలో ఈ హాట్ బ్యూటీ మరింత బిజీ అవ్వాలంటే ఈ సినిమా హిట్ అవ్వాలి. తమిళ యంగ్ హీరో కవిన్ తో కలిసి రుహానీ శర్మ మాస్క్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఈ మూవీలో మరో హాట్ బ్యూటీ ఆండ్రియా జెరెమియా కూడా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.