మెట్రో ప్రయాణికులకు అధికారులు శుభవార్త చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆదివారం రాత్రి మెట్రో రైలు సర్వీసుల సమయం పెంచుతున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12.15 గంటలకు వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని మెట్రో ఎండీ శ్రీధర్ తెలిపారు. స్టేషన్ నుండి చివరి రైలు 12.15 గంటలకు బయలుదేరుతుందని చెప్పారు. అర్ధరాత్రి ఒంటిగంటకు చివరి రైలు గమ్యస్థానానికి చేరుతుందని వివరాలు వెల్లడించారు.
న్యూ ఇయర్ సందర్భంగా మద్యం తాగి వచ్చినా, మెట్రో సిబ్బందిపై, తోటి ప్రయాణికులపై దుర్భాషలాడిన కఠిన చర్యలు ఉంటాయన్నారు. మెట్రో రైలు లోపల, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రయాణికులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. కాగా, ప్రస్తుతం మెట్రో సర్వీస్ రాత్రి 11గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంది.