Homeహైదరాబాద్latest Newsరాజమౌళి సినిమాలో మహేష్ పాత్ర ఇదేనట..!

రాజమౌళి సినిమాలో మహేష్ పాత్ర ఇదేనట..!

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా హాట్ కేకులా మారుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని ఈ సినిమా తొందరగా సెట్స్ మీదకు తీసుకెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా విషయంలో మహేష్ బాబు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఎందుకంటే ఈ సినిమాని పాన్ వరల్డ్ లో చేస్తున్నారు.కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని మహేష్ బాబు దగ్గరుండి మరి తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక రాజమౌళి కూడా మహేష్ బాబు మేకోవర్ కి సంబంధించిన విషయాలను గాని, అలాగే మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అనే దాని మీద చాలా రకాల చర్చలు జరిపి ఆయనకు ఒక సపరేట్ మ్యనరిజం ను క్రియేట్ చేయబోతున్నట్లు గా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఇటు మహేష్ బాబు, అటు రాజమౌళి ఇద్దరు కూడా భారీ సక్సెస్ ని అందుకోబోతున్నారనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇప్పటివరకు పాన్ ఇండియాలోనే సినిమా చేయని మహేష్ బాబు, ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్నాడు అంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి.అయితే ఈ సినిమాలో మహేష్ బాబు అత్యంత కీలకమైన పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటివరకు మహేష్ బాబు చేయని ఒక డిఫరెంట్ రోల్ లో తనని రాజమౌళి చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమాతో మరోసారి రాజమౌళి భారీ హిట్ కొట్టి పాన్ వరల్డ్ లో తన సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img