మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. దబ్రా ప్రాంతంలో నివసిస్తున్న ఓ వివాహిత తన భర్తతో గొడవపడి పక్కింటి సతేంద్ర అనే వ్యక్తితో వెళ్లిపోయింది. సతేంద్ర ఆమెను పెళ్లిచేసుకుంటానని నమ్మించి గ్వాలియర్‌లోని ఓ గదిలో బంధించి 15 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని చెర నుంచి తప్పించుకున్న వివాహిత కుటుంబ సమేతంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.