ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ గప్పాలు కొట్టిన రేవంత్ రెడ్డి ఈనెల 14వ తేదీ వచ్చినా 39,568 మంది అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు జీతాలు రాక ఆవేదన చెందుతున్న పరిస్థితి నెలకొంది అని అన్నారు. 10 నెలలుగా అంగన్వాడి కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించని దుస్థితి -వచ్చింది అని తెలిపారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో మీరు సాధించిన ఘనత ఇది అని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, విశ్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇలా లక్షల మంది సకాలంలో జీతాలు రాక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చేస్తున్న డబ్బా ప్రచారాన్ని ఇకనైనా ఆపండి అని ,మండిపడ్డారు. ఉద్యోగులందరికీ సకాలంలో జీతాలు చెల్లించి మాట నిలుపుకోండి అని హరీష్ రావు తెలిపారు.