కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పట్ల కక్ష పూరితంగా వ్యవహరించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వ పెద్దలు 18సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, అమిత్ షాకు విభజన హామీలపై వివరించామని, తానే స్వయంగా మూడు సార్లు ప్రధానికి విన్నవించానని తెలిపారు. మొత్తం బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని కూడా లేకుండా చేశారన్నారు. తెలంగాణపై ప్రధానికి ఇంత కక్ష ఉందని ఊహించలేకపోయామన్నారు.