ప్రపంచంలో మొట్టమొదటగా న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యేది పసిఫిక్ సముద్రంలోని ‘కిరిబాటి’ దీవిలో, భారత కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకే అక్కడ నూతన సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరం ఆఖరిగా వచ్చే భూభాగాలు అమెరికా పరిధిలోని ‘బేకర్, హోవార్డ్’ దీవులు. అయితే అక్కడ జనావాసాలు లేకపోవడంతో చివరిగా న్యూ ఇయర్ వేడుకలు వచ్చే ప్రాంతంగా ‘సమోవా’ ద్వీపాన్ని పరిగణిస్తారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో జనవరి 1, 14న న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటారు.