Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇండ్లపై తాజా అప్‌డేట్ ఇదే..!

ఇందిరమ్మ ఇండ్లపై తాజా అప్‌డేట్ ఇదే..!

ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బుధవారం వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే 4 సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయలతో పేదలకు 20 లక్షల ఇండ్లు నిర్మించబోతున్నట్లు మంత్రి పొంగులేటి తెలియజేశారు. రాజకీయాలు, కులాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. మిడ్ మానేరు నిర్వాసితులకు రూ.236 కోట్లతో 4,696 ఇండ్ల మంజూరు చేశామన్నారు. ధరణి రికార్డుల నిర్వహణను విదేశీ సంస్థ నుంచి తప్పించి ఎన్ఐసి కు అప్పగించామన్నారు. త్వరలో దేశానికే ఆదర్శంగా నూతన రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img