Homeహైదరాబాద్latest Newsకొత్త రేషన్ కార్డుల జారీపై తాజా అప్డేట్ ఇదే.. దరఖాస్తుల స్వీకరణ అక్కడే..!

కొత్త రేషన్ కార్డుల జారీపై తాజా అప్డేట్ ఇదే.. దరఖాస్తుల స్వీకరణ అక్కడే..!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్ లోనే దరఖాస్తులు స్వీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే గ్రామాలు, వార్డుల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనుంది. అక్కడే దరఖాస్తులు కూడా స్వీకరించనున్నారు. అలాగే అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇచ్చేదానిపై ఇటీవలే మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ అంశంపై త్వ‌ర‌లోనే మ‌రోసారి స‌మీక్ష నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అక్టోబర్ 2 నుంచే దరఖాస్తులను స్వీకరించేందుకు సిద్ధం కావాలని కూడా సూచించారు.

spot_img

Recent

- Advertisment -spot_img