తెలంగాణ పోలీస్ కొత్త లోగోను పోలీస్ శాఖ ‘X’ వేదికగా విడుదల చేసింది. గత లోగోలో ఉన్న ‘STATE’ అనే పదాన్ని తొలగించి కొత్త లోగోను ఆవిష్కరించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో ఉన్న అధికారిక పేర్లలో మార్పులు చేసింది. రాష్ట్ర అధికారిక పేరు తెలంగాణ స్టేట్ను కేవలం తెలంగాణగా మార్చింది. పలు ప్రభుత్వ కార్యాలయాలు తమ శాఖలకు ముందు ఉన్న TS పేరును TGగా మార్చింది.