Homeహైదరాబాద్latest Newsవాలంటైన్స్ డే ముందు రోజు కండోమ్స్​ డే రీజన్​ ఇదే

వాలంటైన్స్ డే ముందు రోజు కండోమ్స్​ డే రీజన్​ ఇదే

మన దేశంలో శృంగారం, కండోమ్ అంటే ఏదో తప్పుగా మాట్లాడేస్తున్నామనే భ్రమలో ఉంటారు. కానీ.. జనాభాలో మన దేశమే అగ్రస్థానంలో ఉంది. కండోమ్ అంటే ఏదో తప్పుగా భావించే భ్రమలో మీరు ఉంటే అది కచ్చితంగా పొరపాటే. ఎందుకంటే దీనిని కుటుంబ నియంత్రణ, లైంగికంగా సంక్రమించే ఇన్​ఫెక్షన్ల ప్రమాదాన్ని నిరోధించే సాధనంగా చెప్తున్నారు నిపుణులు. అందుకే దీని ప్రాముఖ్యతను అందరికీ తెలియజేసే విధంగా ఏటా ఫిబ్రవరి 13వ తేదీన అంతర్జాతీయ కండోమ్స్ డే నిర్వహిస్తున్నారు. బాధ్యతాయుతమైన, సురక్షితమైన లైంగిక ప్రవర్తన నొక్కిచెప్పడానికి, వాలెంటైన్స్ డేకి ఒకరోజు ముందు వ్యూహాత్మకంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన అంతర్జాతీయ కండోమ్ దినోత్సవం జరుపుకుంటారు. సురక్షితమైన సెక్స్ పద్ధతులను ప్రోత్సహించడానికి, HIV లేదా STIలను నివారించడంలో కండోమ్ వినియోగం, ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. లైంగిక ఆరోగ్య విద్య కోసం, కండోమ్​ల ప్రాప్యతను ప్రోత్సాహించడం కోసం, కండోమ్​ల వినియోగం చుట్టూ ఉన్న కళంకాన్ని తగ్గించడం కోసం అంతర్జాతీయ కండోమ్ డేను నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ మహమ్మారిపై కండోమ్​లు గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. 1990 నుంచి కండోమ్ వాడకం పెరిగింది. 117 మిలియన్ల మందిలో కొత్త HIV ఇన్​ఫెక్షన్లను ఇది నివారించినట్లు గణాంకాలు చెప్తున్నాయి. అందుకే కండోమ్స్ వినియోగంపై మళ్లీ విస్తృత స్థాయిలో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img