గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూరగాయల ధరలు కొండెక్కాయి. కేవలం 3 రోజుల్లోనే 20 శాతం మేర ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో కూరగాయలు అందుబాటులో లేక ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. డిమాండుకు సరిపడా సరఫరా లేకపోవడం కూడా అందుకు మరో కారణంగా కనిపిస్తోంది. వివిధ మార్కెట్లలో రూ.10 నుంచి 20 వ్యత్యాసంతో ధరలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.