మాధురి అటు పుట్టింటికి.. ఇటు మెట్టినింటికి దూరమైందని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ మాధురి ఆత్మహత్యాయత్నంకు పాల్పడిందని, అప్పుడు తానే కాపాడి ధైర్యం చెప్పానన్నారు. తన వ్యక్తిత్వ హననం జరుగుతోందంటూ మాధురి పలుమార్లు తనతో చెప్పుకొని బాధ పడిందన్నారు. డిప్రెషన్ మూడ్ వల్లే ఆ ప్రమాదం జరిగిందంటూ ఆమె చెప్పిందని పేర్కొన్నారు.