Homeహైదరాబాద్latest Newsరెండు రాష్ట్రాలలో మోగిన ఎన్నికల నగారా.. ఎన్నికల షెడ్యూల్ ఇదే..!

రెండు రాష్ట్రాలలో మోగిన ఎన్నికల నగారా.. ఎన్నికల షెడ్యూల్ ఇదే..!

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మహారాష్ట్రలో 288, జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు CEC రాజీవ్ కుమార్ తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26, జార్ఖండ్ అసెంబ్లీ గడువు జనవరి 5, 2025 వరకు ఉన్నట్లు రాజీవ్ కుమార్ వివరించారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఒకే విడతలో మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు CEC రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ నెల 22న నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, ఈ నెల 29 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు చెప్పారు. నవంబర్ 20న పోలింగ్.. 23న కౌంటింగ్ జరుగుతుందని వెల్లడించారు.

జార్ఖండ్‌లో రెండు విడతల్లో పోలింగ్
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు CEC రాజీవ్ కుమార్ తెలిపారు. మొదటి దశ నవంబర్ 13, రెండో దశ నవంబర్ 20న పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. ఫలితాలు అదే నెల 23న వెల్లడిస్తామన్నారు.

Recent

- Advertisment -spot_img