HomeసినిమాYash​ కొత్త సినిమా టైటిల్​ ఇదే..

Yash​ కొత్త సినిమా టైటిల్​ ఇదే..

కన్నడ స్టార్, కేజీఎఫ్​ ఫేమ్ యశ్‌ కొత్త సినిమా అప్‌డేట్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఓ ప్రత్యేక వీడియోతో దీని వివరాలను ప్రకటించారు. ఈ చిత్రాన్ని మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కించనున్నట్లు తెలుపుతూ విడుదల తేదీని కూడా పంచుకున్నారు. యశ్‌ 19వ సినిమాగా రానున్న దీనికి ‘టాక్సిక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న యశ్‌.. ‘నువ్వు వెతుకుతున్నది.. నిన్ను కోరుకుంటోంది’అనే క్యాప్షన్‌ రాశారు. ఇక ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్‌10న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇది పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మించనున్నారు. డ్రగ్స్​కు సంబంధించిన కథగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘కేజీఎఫ్‌’ లాంటి భారీ హిట్‌ ప్రాజెక్ట్‌ తర్వాత యశ్‌నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. అందరూ గర్వపడేలా తన తర్వాతి సినిమా ఉంటుందని యశ్‌ ఇటీవల తెలిపారు.

Recent

- Advertisment -spot_img