లాక్కుంటే ఇదే.. ఒక కిరాణ కొట్టు కుర్రాడు డ్రీమ్ 11 అనే ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కోట్లు గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. పలము జిల్లా ప్రధాన కార్యాలయం నుండి కేవలం 5-7 కి.మీ దూరంలో ఉన్న చియాంకి రైల్వే స్టేషన్ సమీపంలోని తెలియబంద్‌కు చెందిన మహేంద్ర మెహతా కొడుకు రవి కుమార్ మెహతా కోట్లు గెలుచుకున్నాడు. ఏప్రిల్ 9న గుజరాత్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌పై బెట్టింగ్ చేసి రవి కుమార్ కోటీశ్వరుడయ్యాడు. ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్‌ను కెప్టెన్‌గా మరియు రషీద్ ఖాన్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. ఆ నిర్ణయం ఫలించినడంతో ఒక్క రాత్రిలో 3 కోట్లు గెలుచుకున్నాడు. ప్రైజ్ మనీలో 30 శాతం జీఎస్టీకి వెళ్లింది. మిగిలిన డబ్బును తన తల్లి ఖాతాకు బదిలీ చేశాడు. ఆ డబ్బుతో సగం పూర్తయిన ఇంటిని నిర్మించి కొంత స్థలం కొనుక్కోవాలని ప్రణాళికలు చేస్తున్నాడు.