ఒలింపిక్ గేమ్స్‌లో భారత్‌కు పతకాలు పెద్దగా రాకపోవడంపై భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో 150 కోట్ల మంది ఉన్నా ఒలింపిక్స్‌లో పతకాలు గెలవలేకపోతున్నాం. ఎందుకంటే ప్రజల్లోని ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించలేకపోతున్నాం. ప్రజలు నన్ను చంపినా సరే.. భయం లేదు. ఇది మాత్రం నిజం’’ అని పేర్కొన్నారు.