నాణ్యమైన పాలతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే శక్తి పెరుగుతందన్నారు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు భార్య తన్నీరు శ్రీనిత. పాల ఉత్పత్తులలో వస్తున్న కొత్త బ్రాండ్ మిల్చి మిల్క్ ఉత్పత్తులను శ్రీనిత చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి అవసరమయ్యే రోగనిరోధక శక్తిని స్వచ్చమైన పాలు దోహదపడతాయన్నారు. ఈ కొత్త బ్రాండ్ పాలు పూర్తిగా స్వచ్చంగా ప్రాసెసింగ్, ప్యాకింగ్, సరఫరా పద్దతులన్నీ హైజెనిక్ పద్దతిలో అనుభవఙ్ఞులైన నిర్వాహకుల పర్యావేక్షణలో చిల్లింగ్ కేంద్రాలు, బల్క్ కూలర్లు, ప్యాకింగ్ స్టేషన్ల ద్వారా సరఫరా చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ బ్రాండ్‌తో వినియోగదారులకు ఇంటి వద్దకే తాజా స్వచ్చమైన పాలు, పాల ఉత్పత్తులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
రోగ నిరోధక శక్తికి ఈ పాలు మేలు.. తన్నీరు శ్రీనిత
RELATED ARTICLES