ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.సిద్ధిఖీ హత్యపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్ధిఖీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మహారాష్ట్రలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి ఈ హత్యే నిదర్శనమని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.శనివారం రాత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యాడు. బాంద్రాలోని ఆయన కుమారుడి కార్యాలయంలో ముగ్గురు గుర్తు తెలియని దుండగులు అతడిని కాల్చిచంపారు.