This Super food for burn Fat in body : గుండె జబ్బులకు దారితీసే చెడు కొలెస్ట్రాల్‌ను కొన్ని రకాల ఆహారంతో తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
రక్తంలో పేరుకుపోయిన కొవ్వును భిన్నమైన ఆహారాలు విభిన్న మార్గాల్లో తగ్గిస్తుంటాయి.
కొవ్వును కరిగించే అద్భుత ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యానికి ముప్పు వాటిల్లకుండా చూసుకోవచ్చని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు చెబుతున్నారు.
రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆ సూపర్ ఫుడ్ వివరాలను వారు వెల్లడించారు.
ఓట్స్, బార్లీ, నట్స్, బీన్స్, పండ్లు,వెజిటబుల్ ఆయిల్స్, సోయా, చేపలు, ఫైబర్ సప్లిమెంట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తరచూ తీసుకుంటే కొవ్వు కరగడంతో పాటు బీపీ అదుపులో ఉంటుందని చెబుతున్నారు.