నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’.. ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ టాక్ షో నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఆహా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానున్న ఈ సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ షోకి పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. గత సీజన్ షో లో పెద్ద స్టార్ హీరోలు, పలువురు రాజకీయ నాయకులు హాజరై బాలయ్యతో సందడి చేశారు.
ఇప్పుడు సీజన్ 4లో కూడా అదే రేంజ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేస్తారని సమాచారం. చిరంజీవి, బాలయ్య… వీరిద్దరూ మంచి స్నేహితులు కావడంతో ఈ సీజన్‌లో చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. అంతేకాదు త్వరలో పుష్ప 2 కూడా విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సీజన్ లో అల్లు అర్జున్, సుకుమార్ కూడా వచ్చి సందడి చేస్తారని సమాచారం. అలాగే స్టార్ బ్యూటీ సమంత కూడా సందడి చేయనుంది. అంతేకాదు ఈ సీజన్ లో శ్రీలీల కూడా మెరుస్తుందని సమాచారం. ఈ క్రమంలో అన్ స్టాపబుల్ సీజన్ 4పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.