రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం కావడంతో రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. పర్మిట్ లేకుండా నడుపుతున్న బస్సులను సీజ్ చేశారు. నిబంధనలు పాటించని 2 బస్సులకు జరిమానా విధించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్ల, బాలాపూర్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నంలో స్కూల్ బస్సులపై దాడులు చేశారు. 60 ఏళ్లు పైబడిన వారిని డ్రైవర్లుగా నియమించకూడదని, కనీసం 5 సంవత్సరాలు అనుభవం ఉన్నవారిని మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇంకా 30 శాతం బస్సులు ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకోవాల్సి ఉందన్నారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు.