బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరిదశకు వచ్చేసింది. ప్రస్తుతం హౌసులో ప్రస్తుతం అవినాష్, గౌతమ్ , నిఖిల్ , నబీల్ అఫ్రిది, ప్రేరణ కంబం ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో విష్ణుప్రియ, రోహిణి చివరి స్థానంలో ఉండగా.. వీరిద్దరూ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. అయితే టాప్ 5లో అవినాష్, గౌతమ్ , నిఖిల్ , నబీల్ అఫ్రిది, ప్రేరణ ఉన్నారు. అయితే బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ ఎవరువుతారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచుస్తునారు. ప్రస్తుతం టైటిల్ రేసులో గౌతమ్, నిఖిల్ ఉన్నారు. వీరిద్దరూ మధ్య పోటీ నడుస్తుంది. అయితే మొదటి నుండి హౌస్ లో ఉన్న నిఖిల్ గెలుస్తాడా లేదా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి టాప్ కంటెస్టెంట్ గా దూసుకుపోయిన గౌతమ్ గెలుస్తాడా అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే ప్రజలు మాత్రం టైటిల్ విన్నర్ గా గౌతమ్ ని చూడాలని అనుకుంటున్నారు. మరి వచ్చే వారం బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోనుంది.