Homeహైదరాబాద్latest Newsఆ భక్తులు తిరుమలకు కాలినడకన రావొద్దు.. టీటీడీ కీలక సూచనలు

ఆ భక్తులు తిరుమలకు కాలినడకన రావొద్దు.. టీటీడీ కీలక సూచనలు

శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా ప్రజలు తిరుపతి తరలివస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చేవారిలో చాలా మంది కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. మార్గమధ్యంలో కొందరు పాదచారులు అస్వస్థతకు గురవుతున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పలు సూచనలు చేసింది. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్తమా, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదని టీటీడీ సూచించింది.
⁠తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బస వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది కనుక భక్తులు తదనగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని తెలిపారు. కాలినడకన వచ్చే భక్తులు ఏవైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట, గాలి గోపురం, భాష్యకర్ల సన్నిధి 1500 మెట్ల వద్ద వైద్య సహాయం పొందవచ్చు అని తెలిపారు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం అందుబాటులో ఉందని భక్తులకు తెలిపారు. కాలినడకన తిరుమల చేరుకునేలా సూచనలను పరిశీలించి సహకరించాలని టీటీడీ కోరింది. అలాగే తిరుమలలోని ఆశ్వినీ ఆసుపత్రి, ఇతర వైద్యశాలల్లో 24×7 వైద్య సదుపాయం పొందవచ్చు అని టీటీడీ పేర్కొంది.

Recent

- Advertisment -spot_img