కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఆదేశాల మేరకు పునర్విభజన చట్టం కింద కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) ఆదేశించిన సంగతి తెలిసిందే.ఈ మేరకు డీఓపీటీ కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే, డిఓపిటి ఆదేశాలను సవాలు చేస్తూ పలువురు ఐఎఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. డీవీపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, ఆమ్రపాలి, సృజన క్యాట్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణలోనే కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, ఆమ్రపాలి కోరారు. ఏపీలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని సృజన ఐఏఎస్ అధికారిని కోరారు. వీరి పిటిషన్లను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మంగళవారం విచారించనుంది.