Homeహైదరాబాద్latest Newsమహిళా డాక్టర్ హత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలి

మహిళా డాక్టర్ హత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలి

  • ఎంసీపీఐ యు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గోనె కుమార్ స్వామి డిమాండ్

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రంలో, ఎం సిపిఐ యు పార్టీ మహబూబాద్ జిల్లా కమిటీ సమావేశం కామ్రేడ్ కడకం బుచ్చి రామయ్య అధ్యక్షతన జరిగింది. ముందుగా ఇటీవల మరణించిన ఎం సిపిఐ యూ పార్టీ గీసుకొండ మండల కార్యదర్శి కామ్రేడ్ కందికొండ కుమారస్వామి, వరంగల్ తొలివెలుగు జర్నలిస్ట్ యోగి రెడ్డి, కేరళ రాష్ట్రంలో వరదలు సంభవించి కొండ చర్యలు విరిగిపడి మరణించిన వాయినాడు ప్రజలకు, అట్లాగే నిన్న పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో మహిళ జూనియర్ డాక్టర్ అత్యాచారం చేసి, హత్యకు గురైన డాక్టర్ కు ఈ సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం జరిగిన సమావేశంలో కామ్రేడ్ గోనె కుమారస్వామి ఎం సిపిఐయు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు, వేధింపులు, హత్యలు జరుగుతున్నాయని వీటిని కట్టడి చేయాల్సిన పాలక ప్రభుత్వాలు ఉదాసీన వైఖరి అవలంబించడం వలన, ఇలాంటి సంఘటనలు పెట్రేగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలకత్తాలో జరిగిన మహిళా డాక్టర్ హత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించి, డాక్టర్ కుటుంబానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాలు సంభవించి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర జబ్బులతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉండి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, సరైన సమయంలో వైద్యం అందించి మందులు అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకొని, సీజనల్ వ్యాధులను అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కామ్రేడ్ కంచ వెంకన్న ఎంసీపీఐ యు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. ఆగస్టు 24, 25 తేదీలలో గూడూరు మండల కేంద్రంలో జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, జిల్లాలోని పార్టీ సభ్యులకు రెండు రోజులు శిక్షణ తరగతులు ఉంటాయని, ఇందులో పార్టీ నిర్మాణం ప్రజా సమస్యలపై ప్రజా ఆందోళనలు తదితర విషయాలపై తర్ఫీదు శిక్షణ ఇవ్వన్నట్లు ఈ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నూకల ఉపేందర్, జిల్లా కమిటీ సభ్యులు బందెల వీరస్వామి, మారం నరసింహారెడ్డి, ఎడ్లపల్లి రమేష్, కటకం బుచ్చి రామయ్య, ఈసం రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img