మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజకి రెడీగా ఉంది. కింగ్ నాగార్జున ప్రస్తుతం ‘కుబేర’, ‘కూలి సినిమాల్లో’ నటిస్తున్నారు. కూలీ సినిమాలో నాగార్జున విలన్‌గా నటించడం విశేషం. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకేటేష్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా సంక్రాంతికే రాబోతోంది.అయితే ఈ ముగ్గురు కలయకలో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా రావాల్సి ఉంది. అయితే క్యారెక్టర్ల పరంగా అన్నీ సెట్ కాలేదు అని దర్శకుడు భావించారు ..ఆలా ఆ సినిమా మిస్సయింది. ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటో తెలుసా..?
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో శ్రీకాంత్ పోషించిన పాత్రను వెంకటేష్ చేత వేయించాలనుకున్నారు. కథ చెప్పిన తర్వాత జలాయి చుట్టూ తిరిగే క్యారెక్టర్ కావడంతో వెంకీ లాంటి సూపర్‌స్టార్‌కి సెట్ అవ్వదని కృష్ణ వంశీకి చెప్పాడు. అలాగే రామ్ చరణ్ తండ్రి పాత్రను నాగార్జున పోషించాలని భావించి నాగ్ కు కథ చెప్పాడట..కాకపోతే అది కూడా వర్క్ అవుట్ కాలేదు. అలాగే ప్రకాష్ రాజ్ పాత్రను కృష్ణ పోషించాలని బలంగా అనుకున్నారు. సినిమాకు ప్రధాన బలం ఆ పాత్ర. అయితే అనారోగ్య పరిస్థితుల్లో కృష్ణ గారు ఈ పాత్రను పోషించగలరా? లేదా? దీంతో ఇబ్బంది పడుతుందని భావించి చివరకు ప్రకాష్ రాజ్‌ను ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా విడుదలై ఎబోవ్ యావరేజ్ గా నిలించింది.
.