‘భగవంత్ కేసరి’సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో ఆయన హ్యాట్రిక్ కొట్టారు. డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో బాలయ్య ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే త్రిషను ఒక హీరోయిన్గా ఫైనల్ చేశారని టాక్. తాజాగా మీనాక్షి చౌదరిని మరో హీరోయిన్గా తీసుకున్నట్లు సమాచారం. అయితే, మేకర్స్ నుంచి ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఈ మూవీ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.