Homeహైదరాబాద్latest Newsఆ మాటలు చాలా బాధను కలిగిస్తాయి..శోభితా ఎమోషనల్ కామెంట్స్!

ఆ మాటలు చాలా బాధను కలిగిస్తాయి..శోభితా ఎమోషనల్ కామెంట్స్!

శోభితా ధూళిపాళ ఆడిషన్స్ కోసం వెళితే నీవు నల్లగా ఉన్నావు, అందంగా లేవు అని సినిమాల్లో పనికిరావు అని అవమానించారట. బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కడం చాలా కష్టం. చాలా మంది సెలబ్రిటీలు ఈ కష్టాలను ఎదుర్కొంటారు. కొందరు మాత్రమే వాటన్నింటినీ ఓపికగా అధిగమిస్తూ చివరికి స్టార్ యాక్టర్స్ అయిపోతారు. అలాంటి వారిలో ఒక తెలుగమ్మాయి గురించి చెప్పాలి. కట్ చేస్తే ఇప్పుడామె ఓ స్టార్ హీరోయిన్. గూఢచారి (2018) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే.చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో ప్రముఖ నటిగా ఫేమ్ క్రియేట్ చేసుకుంది. అనిల్ కపూర్, నవాజుద్దీన్ సిద్దిఖీ, విక్కీ కౌశల్ వంటి స్టార్ యాక్టర్స్‌తో కలిసి వర్క్ చేసింది.ప్రస్తుతం ఓటీటీలో హయ్యెస్ట్ పారితోషికం తీసుకునే హీరోయిన్లలో శోభితా ధూళిపాళ కూడా ఒకరు. ఈ ఏడాది దేవ్ పటేల్ డైరెక్షన్‌లో వచ్చిన ‘మంకీ మ్యాన్’ సినిమాతో హాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది.

Recent

- Advertisment -spot_img