Homeజిల్లా వార్తలుతోటపల్లి వాసి మాశం శ్రీనివాస్ కు డాక్టరేట్..

తోటపల్లి వాసి మాశం శ్రీనివాస్ కు డాక్టరేట్..

ఇదేనిజం, బెజ్జంకి : బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన మాశం శ్రీనివాస్ కు కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. “కాస్ట్ లీడర్షిప్ అండ్ పాలిటిక్స్ ఇన్ తెలంగాణ స్టేట్- ఎ స్టడీ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్” అనే అంశంపై సమర్పించిన పరిశోధనా గ్రంథానికి గాను మాశం శ్రీనివాస్ కు డాక్టరేట్ ప్రధానం చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ నరసింహాచారి తెలిపారు. ఇతను పొలిటికల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ హరిప్రసాద్ పర్యవేక్షణలో తన పి హెచ్ డి పూర్తి చేశారు. ఇందుకుగాను విభాగ అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు. శ్రీనివాస్ పి హెచ్ డి చేయక ముందే కాకతీయ యూనివర్సిటీ లో ఎం.ఎ, ఎం.ఫిల్ చేసాడు. హన్మకొండ ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో బి.ఎడ్ చదివాడు. తెలంగాణ “స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్” లో కూడా అర్హత సాధించాడు.

Recent

- Advertisment -spot_img