గాజు గ్లాసు గుర్తు కూటమికి గండంగా మారింది. జనసేన పోటీ చేయని స్థానాల్లో కొందరు ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో కూటమి ఓటింగ్ శాతంపై ప్రభావం పడనుంది. దీనిపై కూటమి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మరోవైపు పిఠాపురంలో పవన్ కల్యాణ్ పేరుతో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేసిని విషయం తెలిసిందే. రాష్ట్రంలో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుండగా మిగిలిన స్థానాల్లో టీడీపీ, బీజేపీ పోటీలో ఉన్నాయి.