threats to blow up ayodhya ram mandir
అయోధ్య రామాలయానికి ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి. పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ రామమందిరంపై దాడి చేస్తామంటూ ఓ ఆడియో రిలీజ్ చేసింది. ఆలయాన్ని కూల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఆలయ ప్రాంగణంలో భద్రతను కూడా పెంచారు. అయోధ్యలో ఎన్‌ఎస్‌జీ హబ్‌ను సిద్దం చేస్తున్నారు.