ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంకు 45 బ్లీచింగ్ పౌడర్ సంచులు సిరిసిల్లలో కొనుగోలు చేసి తీసుకొని వచ్చి క్రమంలో కార్యాలయంలో సంచులు దించి లెక్కించే సరికి 42 బ్లీచింగ్ పౌడర్ సంచులు ఉండడంతో మూడు సంచులు లేవని అధికారులకు సిబ్బంది తెలిపారు. బ్లీచింగ్ పౌడర్ సంచులు మాయమైన విషయం మాజీ వార్డు సభ్యులు దిటి నర్సింలు చెవిలో పడగా వెంటనే స్థానిక స్పెషల్ అధికారి దృష్టికి తీసుకువెళ్లి వాటిపై విచారణ చేపట్టాలని కోరారు బ్లీచింగ్ పౌడర్ సంచుల విలువ సుమారు ఒక సంచికి వెయ్యి రూపాయలు ఉంటుందని తెలిపారు అలాగే మార్గమధ్యలో వస్తున్నప్పుడు బ్లీచింగ్ పౌడర్ సంచులను కాజేశానని ఆరోపిస్తున్నారు వాటిపై వెంటనే విచారణ చేపట్టి ప్రజాధనాన్ని దుర్నియోగం కాకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉన్నదని మాజీ వార్డు సభ్యులు దిటి నర్సింలు అన్నారు.