Homeఅంతర్జాతీయంApple : రూ. 3 కోట్లు పలికిన యాపిల్ ఒరిజినల్ కంప్యూటర్‌

Apple : రూ. 3 కోట్లు పలికిన యాపిల్ ఒరిజినల్ కంప్యూటర్‌

Three crores for Apple original computer : రూ. 3 కోట్లు పలికిన యాపిల్ ఒరిజినల్ కంప్యూటర్‌..

యాపిల్‌( Apple ) సంస్థ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ కలిసి 1976లో తయారు చేసిన యాపిల్‌-1 కంప్యూటర్‌ వేలంలో దాదాపు 3 కోట్ల రూపాయలు ($400,000) ధర పలికింది.

ఈ యాపిల్‌-1 కంప్యూటర్ కెబినెట్‌ను అరుదైన హవాయి కోవా కలపతో నిర్మించారు.

ఇది ఇప్పటికీ వర్కింగ్ కండిషన్‌లోనే ఉంది.

అప్పట్లో ఇలాంటివి దాదాపు 200 కంప్యూటర్లను మాత్రమే తయారు చేసి విక్రయించారు.

”ఇంతకు ముందు ఈ కంప్యూటర్‌కు ఇద్దరు యజమానులు మాత్రమే ఉన్నారు.

ఒకరు కళాశాల ప్రొఫెసర్ కాగా, మరొకరు దీన్ని 650 డాలర్లకి కొనుగోలు చేసిన ఆయన విద్యార్థి” అని కాలిఫోర్నియాలో వేలం పాట నిర్వహించిన జాన్ మోరన్ చెప్పారు.

యాపిల్‌-1తోపాటు రెండు క్యాసెట్ టేపుల్లో యూజర్ మాన్యువల్‌లు, ఆపిల్( Apple ) సాఫ్ట్‌వేర్‌లను కలిపి వేలం వేశారు.

“పాతకాలపు ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి కంప్యూటర్, టెక్ సేకరణదారులకు యాపిల్‌-1 ఓ అమూల్యమైన బహుమతిలాంటిది” అని మంగళవారం వేలానికి ముందు లాస్‌ఏంజిల్స్ టైమ్స్‌తో యాపిల్-1 నిపుణులు కోరీ కోహెన్ అన్నారు.

1976 ఏప్రిల్ 1న కాలిఫోర్నియాలోని ఓ గ్యారేజీలో జాబ్స్, వోజ్నియాక్, రోనాల్డ్ వేన్ యాపిల్‌( Apple ) సంస్థని స్థాపించారు.యాపిల్‌-1 ఉత్పత్తికి డబ్బు కోసం, జాబ్స్ తన ఫోక్స్‌వ్యాగన్‌ మైక్రో బస్‌ను విక్రయించగా, వోజ్నియాక్ తన హెచ్‌పీ-65 క్యాలిక్యులేటర్‌ను 500 డాలర్లకి విక్రయించారు.

1976లో ఈ మెషీన్లను 666.66 డాలర్లకి విక్రయించారు. ఎందుకంటే వోజ్నియాక్ పునరావృత సంఖ్యలను ఇష్టపడేవారు.

ప్రపంచంలో ఇలాంటివే దాదాపు 20 కంప్యూటర్లు ఇప్పటికీ పని చేస్తున్నట్టు భావిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img