కాంగ్రెస్ ప్రభుత్వంపై ‘బిఆర్ఎస్’ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ రాష్ట్రంలో త్రీడి పాలన నడుస్తోంది.. అంటే డైవర్షన్, డిస్ట్రాక్షన్, డిమోలిషన్ అనేది మాత్రమే నడుస్తోంది అని కేటీఆర్ అన్నారు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఉన్న ఇబ్బందులతో పోలిస్తే ఈ ఇబ్బంది ఎంత ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు నేను కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా చెబుతున్న ఈ కేసు నాకు ఇబ్బంది అసలే కాదు అని కేటీఆర్ అన్నారు. ఈ కేసు సంగతి నేను చేసుకుంటాను.. ప్రస్తుతం మనమందరం రైతుల సమస్యలపై అందరం కొట్లాడతాం అని పేర్కొన్నారు.. రైతు రుణమాఫీ అందరికీ జరగలేదు.ఈ విషయంలో సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్ళదం.. వెళ్లి అక్కడ కొట్లాడదాం అని కేటీఆర్ తెలిపారు.