Three lakh houses Distribution : ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. వచ్చే శ్రావణ మాసంలో 3 లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు లక్ష మంది లబ్ధిదారులకు రూ. 300 కోట్ల నిధులను మంజూరు చేసింది. పెండింగ్ బిల్లుల చెల్లింపు, నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే 2.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మరో 50 వేల ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి శ్రావణ మాసంలో మొత్తం 3 లక్షల ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంపై దశలవారీగా సమీక్షలు నిర్వహించి, నిధుల విడుదల, పెండింగ్ పనుల పూర్తీకి సంబంధించిన సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.