యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మువీ గా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ కు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటలీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో తీస్తున్న చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులను ఎంపిక చేశారు.
దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్, హిందీకి మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు పాటలే అత్యంత కీలకం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దర్శకుడు జిల్ రాధాకృష్ణ తెలిపారు.