ఇదే నిజం, దేవరకొండ: దేవేరకొండ నియోజకవర్గం(పెద్ద అడిశర్లపల్లి మండలం లోని) నూతన మండలం గుడిపల్లి మండల పరిధిలోని గణపురం గ్రామ సమీపంలోని ఉన్న పెద్దమ్మ గుడి లో మంగళవారం మూడు నాటు తుపాకులు లభ్యమయ్యాయి గుడిపల్లి ఎస్సై నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం పొద్దున్నే ఆలయానికి వెళ్ళిన పూజారి తుపాకులను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో వెంటనే పోలీస్ వారు వెళ్లి చూడగా పెద్దమ్మ గుడిలో మూడు నాటు తుపాకులు లభించినట్లు తెలిపారు. పంచనామా అనంతరం మూడు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ లభ్యమైన తుపాకులు ఎవరో రహస్యంగా పెట్టారని అనుమానిస్తున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు