Homeజిల్లా వార్తలుమహాలక్ష్మి పథకం ద్వారా బిపిఎల్ కుటుంబాలకు సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలను అందజేత

మహాలక్ష్మి పథకం ద్వారా బిపిఎల్ కుటుంబాలకు సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలను అందజేత

ఇదేనిజం, గొల్లపల్లి : కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం ద్వారా బి పి ఎల్ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఇప్పటికే రూ.500/- లకే సిలిండర్ లను ప్రజలకు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం తాజాగా ఇందుకు సంబందించిన ప్రొసీడింగ్ పత్రాలను గొల్లపల్లి మండలం మల్లన్న పేట గ్రామ పంచాయతీ ఆవరణలో ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించడం జరిగింది. అనంతరం ఇటీవల ఏఎంసీ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వికరించిన భీమా సంతోష్ ని శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జీపీ ప్రత్యేక అధికారి సురేష్ రెడ్డి,కార్యదర్శి రమేష్,మాజీ సర్పంచ్ సిద్దెంకి నర్సయ్య,మాజీ ఎంపీటీసీ గోస్కుల రాజన్న,మాజీ ఉపసర్పంచ్ బేరా కిషోర్,సిద్దెంకి మల్లారెడ్డి,సిద్దెంకి రమేష్,బండారి గంగాధర్,లంబ లస్మయ్య,బండి దేవేందర్,కళ్లెం రాజన్న,పడాల గంగారెడ్డి,భీమా శంకర్,కళ్లెం మల్లేష్,అంగన్వాడి టీచర్స్,ఆశా వర్కర్స్,తదితరులు పాల్గొన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img