శరద్ పవార్ ఎన్సీపీలో తన కుమార్తె చేరుతుందన్న వార్తల నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి ధర్మారావుబాబా ఆత్రామ్ స్పందించారు. నమ్మకద్రోహానికి పాల్పడితే ఊరుకోవద్దని వ్యాఖ్యానించారు. అప్పుడు తన కుమార్తె, అల్లుడిని నదిలో తోసేయాలని పేర్కొన్నారు. ఇటీవల ఆయన కూతురు భాగ్య శ్రీ, అల్లుడు రితురాజ్ ఎన్సీపీ(ఎస్పీ)లో చేరతారని ప్రచారం జరుగుతోంది.